భారత్‌కు హైస్పీడ్ ఇంటర్నెట్

9
- Advertisement -

భారత్‌లో హైస్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ప్రకటించింది. శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో పోటీని స్వాగతిస్తున్నామని, అయితే అన్ని సంస్థలూ భారత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొన్న నేపథ్యంలో స్టార్‌లింక్ ఈ మేరకు స్పందించింది.

భారత్‌లో ఇంటర్నెట్ సేవల విస్తరణ కోసం గత ఐదేళ్లకు పైగా ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, పరిశ్రమకు చెందిన సంస్థలు, టెలికాం ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్నామని స్టార్‌లింక్ వెల్లడించింది. దేశీయ వినియోగదారులకు సురక్షితంగా, భద్రతతో కూడిన సేవలు అందించేందుకు అవసరమైన ప్రత్యేక నెట్‌వర్క్ వ్యవస్థలు, గేట్‌వేలు, ఇతర మౌలిక సదుపాయాలను భారత్‌లోనే ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అవసరమైన ప్రభుత్వ అనుమతులు కూడా పొందినట్లు పేర్కొంది.

ఇటీవల స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించడాన్ని కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయంటూ ఎలాన్ మస్క్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో రిలయన్స్ స్పందించింది. తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని, శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో స్టార్‌లింక్‌తో పాటు ఇతర సంస్థల ప్రవేశాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేసింది.

Also Read:Reality:ఆలోచనగా దేవికా భట్

అయితే, భారతీయ సంస్థలైనా, విదేశీ కంపెనీలైనా దేశ చట్టాలు, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రిలయన్స్ పేర్కొంది. తమ అనుబంధ సంస్థ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సేవలు కూడా ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని వెల్లడించింది. అయితే, స్టార్‌లింక్ సేవలు వాణిజ్యపరంగా ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -