ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ చమిందా వాస్‌ను జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్‌లో కోచ్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.
శ్రీలంక తరఫున అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన వాస్.. టెస్టుల్లో 355 వికెట్లు, వన్డేల్లో 400 వికెట్లు పడగొట్టారు. ప్రధాన కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త సహాయక సిబ్బందిలో ఆయన చేరనున్నారు. ఈ వారం ప్రారంభంలోనే యువరాజ్ సింగ్‌ను అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా ఢిల్లీ జట్టు నియమించింది. గత రెండు సీజన్లుగా బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన మునాఫ్ పటేల్ స్థానంలో వాస్ బాధ్యతలు చేపట్టనున్నారు.
52 ఏళ్ల చమిందా వాస్‌కు కోచింగ్‌లోనూ అనుభవం ఉంది. శ్రీలంక పురుషుల జట్టుకు మూడు వేర్వేరు సందర్భాల్లో బౌలింగ్ కోచ్‌గా సేవలందించారు. తొలుత న్యూజిలాండ్ జట్టుతో స్వల్పకాలిక ఒప్పందంపై కోచింగ్ ప్రారంభించిన ఆయన.. 2013 నుంచి 2015 వరకు శ్రీలంక జట్టుకు కోచ్‌గా పనిచేశారు. 2016లో టీ20 ప్రపంచకప్ కోసం ఐర్లాండ్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. అనంతరం మళ్లీ శ్రీలంక జట్టుతో పనిచేశారు.
Also Read:Reality:ఆలోచనగా దేవికా భట్
ఆటగాడిగా కూడా వాస్‌కు ఐపీఎల్‌తో అనుబంధం ఉంది. 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడారు. ఆ జట్టు తరఫున 13 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు సాధించారు. ఇప్పుడు కోచ్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.

