‘రుటూర్’ను ప్రారంభించిన కేటీఆర్

5
- Advertisement -

వరంగల్ కేంద్రంగా రూపుదిద్దుకున్న స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ (RUTUR)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ప్రారంభించారు. సాంకేతికత, ఆవిష్కరణలతో నిత్య ప్రయాణాలను మరింత మెరుగుపరచడం, ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన లక్ష్యం.

అశోక్ స్థాపించిన రుటూర్ సంస్థలో నిఖిల్ సీఈఓగా, క్రాంతి సీఓఓగా, అక్షయ్ సీఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమ్మకమైన రైడ్ సేవలు, వినూత్న సాంకేతికత, డ్రైవర్ల నుంచి కమీషన్ వసూలు చేయని విధానం ద్వారా ప్రయాణికులకు సరసమైన ధరల్లో రవాణా సేవలు అందించడమే ఈ సంస్థ లక్ష్యం.

డ్రైవర్లకు మెరుగైన ఆదాయ అవకాశాలను కల్పిస్తూ, ప్రయాణికులకు అందుబాటు ధరల్లో సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించేందుకు రుటూర్ కృషి చేయనుంది.

Also Read:ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పెద్దపేగు క్యాన్సర్?

రుటూర్ వ్యవస్థాపకులు, బృందానికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మొబిలిటీ రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టడంతో పాటు, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌ వ్యవస్థకు రుటూర్ మరింతగా తోడ్పడాలని ఆకాంక్షించారు.

- Advertisement -