బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా కెప్టెన్సీ టాస్క్ కొత్త వివాదాలకు దారితీసింది. శివ్ చేసిన కామెంట్స్..త్రిగుణ్ వ్యూహాలు, ఝాన్సీ తీసుకున్న నిర్ణయంతో ఇంటి సభ్యుల మధ్య వార్ జరుగగా చివరికి కెప్టెన్సీ పోటీలో రాంప్రసాద్ విజయం సాధించడంతో ఎపిసోడ్ ముగిసింది.
ఉదయం ముకేశ్‌తో మాట్లాడిన శివ్.. తన గ్రూప్‌లో ఝాన్సీనే ముఖ్యమని చెప్పాడు. వర్షిణి, ఝాన్సీలలో ఎవరికి మద్దతిస్తావని అడగ్గా.. తన తొలి ప్రాధాన్యత ఝాన్సీకేనని స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని వర్షిణితోనూ పంచుకున్నాడు. మరోవైపు, దక్షి చేతికి గాయం కావడంతో నరేశ్ పసుపు పెట్టాడు. సరదాగా ఆమె నుదుటిపైనా పసుపు పెట్టడంతో దేబ్జానీ అలిగింది. నరేశ్ ఆమెను ఆటపట్టించగా, అమ్మాయిలు ఇలాంటి విషయాలకే అలుగుతారని వర్షిణి వ్యాఖ్యానించింది.
మూడు టీమ్‌లకు ‘సమరానికి సై’ అనే చివరి టాస్క్ ఇచ్చారు. మట్టి గుంటలో ఉన్న బంతిని తీసుకొని తమ బాక్స్‌లో వేసిన టీమ్‌కే పాయింట్లు లభిస్తాయి. ప్రతి రౌండ్‌లో బోనస్ కాయిన్స్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. అయితే మొదటి రౌండ్‌లో వంశీ, రామకృష్ణ, రోహిత్ పోటీపడినా ఎవరికీ పాయింట్లు దక్కలేదు.
మూడో రౌండ్‌లో గోల్డ్ టీమ్.. బ్లూ టీమ్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకుంది. శివ్ త్రిగుణ్‌కు సాయం చేయగా, త్రిగుణ్ అమన్‌కు సహకరించి బంతిని అతడికి అందించాడు. దీంతో అమన్ బంతిని బాక్స్‌లో వేశాడు. ఈ పరిణామంపై శివ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమతో ఒప్పందం చేసుకొని మరో టీమ్‌కు ఎలా సాయం చేస్తారని ప్రశ్నించాడు. త్రిగుణ్ మాత్రం ఇదంతా తన వ్యూహమేనని చెప్పడంతో ఇంట్లో వాదనలు పెరిగాయి. సుధీర్‌పై రోహిత్ తీవ్ర విమర్శలు చేశాడు.
చివరకు గ్రీన్ టీమ్ సభ్యులతో పాటు 70 పాయింట్లు కలిగిన శివ్ కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించారు. ముకేశ్, వంశీ, వర్షిణి, శివ్, రాంప్రసాద్, అమన్, ఝాన్సీ కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొన్నారు. ఒక్కొక్కరుగా పోటీ నుంచి తప్పుకోగా చివరికి ముకేశ్, రాంప్రసాద్ మాత్రమే మిగిలారు.
ALso Read:ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పెద్దపేగు క్యాన్సర్?
అయితే ఝాన్సీ ముకేశ్‌కు మద్దతివ్వకుండా రాంప్రసాద్‌కు అండగా నిలిచింది. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన ముకేశ్ పోటీ నుంచి దిగిపోయాడు. ఈ పరిణామంతో రాంప్రసాద్ కెప్టెన్‌గా నిలిచాడు.

