భారత ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 11, 12 తేదీల్లో కెనడాలో పర్యటించనున్నారు. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య కొనసాగిన దౌత్యపరమైన విభేదాల తర్వాత ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై భారత్, కెనడా దృష్టి సారించాయి.
ఒట్టావాలోని భారత హైకమిషన్ శుక్రవారం ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాల నాయకులు నిర్ణయించినట్లు తెలిపింది. అంతకుముందు గురువారం కాల్గరీలోని ఓ రెస్టారెంట్లో సందర్శకులతో మాట్లాడిన సందర్భంగా కార్నీ కూడా మోదీ పర్యటన గురించి వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల కారణంగా అమెరికాతో సంబంధాల్లో ఒత్తిళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో, కెనడా ఇతర దేశాలతో ఆర్థిక భాగస్వామ్యాలను విస్తరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో భారత్తో వాణిజ్య సంబంధాలు కీలకంగా మారాయి.కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మనీందర్ సిద్ధూ ప్రస్తుతం ఆరు రోజుల పర్యటనలో భాగంగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏటా 70 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆదేశ మీడియా వర్గాలు వెల్లడించాయి.
Also Read:రేవంత్ , భట్టి..రాజీనామా చేయరా?

