SP:అఖిలేశ్ యాదవ్‌కు బిగ్ షాక్..

8
- Advertisement -

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్ సింగ్, గోసాయిగంజ్ ఎమ్మెల్యే అభయ్ సింగ్, కాల్పీ ఎమ్మెల్యే వినోద్ చతుర్వేది బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు వచ్చిన ఈ వార్త ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం అఖిలేశ్ యాదవ్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read:SIRపై సుప్రీంకు ఒవైసీ

రాకేశ్ ప్రతాప్ సింగ్, అభయ్ సింగ్, వినోద్ చతుర్వేది పార్టీ మార్పుతో సమాజ్‌వాదీ పార్టీకి ఎదురైన నష్టంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, ఈ చేరికలు బీజేపీకి ఎంతవరకు రాజకీయంగా కలిసివస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -