చైతూను పెళ్లి చేసుకోవాలనుకోలేదు!

5
- Advertisement -

ప్రముఖ నటి శోభిత ధూళిపాళ తన వ్యక్తిగత జీవితం, వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తాను నటుడితో ఎప్పటికీ డేటింగ్ చేయనని చెప్పానని అయితే ఆ సమయంలో తన ఆలోచనా విధానం పరిమితంగా ఉండేదని అంగీకరించింది. తన అభిప్రాయాలు కాలానుగుణంగా మారడాన్ని స్వాగతిస్తానని తెలిపింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

2016లో శోభిత ఓ ఇంటర్వ్యూలో నటుడితో ప్రేమలో పడేందుకు ఇష్టపడనని చెప్పింది. నటీనటుల మధ్య సంబంధాల్లో వ్యక్తిగత ప్రతిష్ఠ, బాహ్య ఆకర్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం అప్పట్లో ఆమెకు ఉండేది. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అప్పట్లో తన చుట్టూ చూసిన పరిస్థితుల ఆధారంగా ఇతరుల గురించి ఒక అభిప్రాయానికి వచ్చానని వివరించింది.

మనుషుల ఆలోచనలు కాలంతో పాటు మారడం సహజమని, గతంలో ఉన్న అభిప్రాయాలనే ఎప్పటికీ పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది. కొత్త అనుభవాలకు అనుగుణంగా తన అభిప్రాయాలను మార్చుకోవడానికి తాను సిద్ధంగా ఉంటానని చెప్పింది.

Also Read:కిమ్ జోంగ్ ఉన్‌తో ట్రంప్ భేటీ!

శోభిత ధూళిపాళ, అక్కినేని నాగ చైతన్య 2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సంప్రదాయ తెలుగు పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అంతకుముందు 2024 ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిగింది. వీరి ప్రేమ వ్యవహారం కొంతకాలం వరకు గోప్యంగానే కొనసాగింది.

నాగ చైతన్య గతంలో నటి సమంత రూత్ ప్రభును వివాహం చేసుకోగా, 2021లో ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత శోభితతో చైతన్య బంధం వార్తల్లో నిలిచింది.

- Advertisement -