BB10: అమన్, త్రిగుణ్ సేఫ్!

1
- Advertisement -

బిగ్‌బాస్ సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. కొత్త టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఊహించని పరిణామాలతో హౌస్‌లో సందడి నెలకొంటోంది. అక్టోబర్ 8న ప్రసారమైన 30వ రోజు ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు టాస్కుల్లో పోటీపడటంతో పాటు వ్యక్తిగత విభేదాలతోనూ వార్తల్లో నిలిచారు.

ఐదు జంటలకు బిగ్‌బాస్ ‘స్టెప్ రోల్ గోల్’ టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో గెలిచిన క్రమాన్ని బట్టి పాయింట్లు కేటాయిస్తామని ప్రకటించారు. వంశీ, దేబ్జానీ సంచాలకులుగా వ్యవహరించారు. కంటెస్టెంట్లు ఉత్సాహంగా పోటీపడగా, అపూర్వ రూల్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో నరేశ్‌తో వాగ్వాదానికి దిగింది. చివరికి అమన్ మొదటి స్థానంలో నిలిచి 100 పాయింట్లు సాధించాడు. రాంప్రసాద్‌కు 80, ముకేశ్‌కు 60, షాలినికి 40, అపూర్వకు 20 పాయింట్లు లభించాయి.

మరోవైపు రోహిత్, అపూర్వ మధ్య చిన్న విషయం పెద్ద వివాదానికి దారితీసింది. తమకు ప్రైవసీ ఇవ్వాలని రోహిత్ చెప్పడంతో అపూర్వ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆ విషయాన్ని మళ్లీ ప్రస్తావించడంతో షాలిని కూడా మధ్యలోకి వచ్చి అపూర్వతో గొడవపడింది. తన గురించి అనవసరంగా చర్చించవద్దని అపూర్వ అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో త్రిగుణ్, అమన్‌ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

ఆ తర్వాత వర్షిణి, ముకేశ్‌లు నరేశ్‌ను స్విమ్మింగ్ పూల్‌లో పడేయడంతో హౌస్‌లో సందడి నెలకొంది. అనంతరం లీడర్‌బోర్డులో 180 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన అమన్, త్రిగుణ్ నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యారు.

Also Read:‘ఇట్లు అర్జున’..కొత్త లవ్ స్టోరీ!

మూడో టాస్క్‌గా ‘చిత్రం భలారే విచిత్రం’ నిర్వహించారు. ఇందులో బొమ్మలను గుర్తించడం, వాటికి సంబంధించిన వస్తువులను తీసుకురావడం కీలకంగా మారింది. ఈ గేమ్‌లోనూ చీటింగ్ ఆరోపణలు, సంచాలకుల నిర్ణయాలపై అభ్యంతరాలతో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి. రాంప్రసాద్ ఐదు బొమ్మలను సరిగ్గా గుర్తించి ఆకట్టుకున్నాడు.

చివరికి రాంప్రసాద్, నరేశ్ జంట 220 పాయింట్లతో ముందంజలో నిలిచింది. అపూర్వ, చరణ్ జంటకు 200, ముకేశ్, ఝాన్సీ జంటకు 160, రోహిత్, షాలిని జంటకు 140 పాయింట్లు వచ్చాయి.

- Advertisement -