జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే..కేటీఆర్ డిమాండ్

1
- Advertisement -

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై నిరసన తెలియజేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.

జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధ సంస్థలపై కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగం కంటే ఏ ఒక్క వ్యక్తి గొప్పవాడు కాదని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని కాపాడేందుకు ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవిలో కొనసాగడానికి సమయం ముగిసిందని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Also Read:‘ఇట్లు అర్జున’..కొత్త లవ్ స్టోరీ!

ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆరోపణలు, SIR ప్రక్రియకు సంబంధించిన వివాదాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో సీఈసీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల సంఘం పనితీరుపై తమ అభ్యంతరాలను తెలియజేయాలని పార్టీ భావిస్తోంది.

- Advertisement -