బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైరల్ జ్వరం, ఫ్లూ సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కొంతకాలంగా జ్వరం, ఫ్లూ లక్షణాలు ఇబ్బంది పెడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. వైద్యుల సూచనల ప్రకారం అవసరమైన మందులు తీసుకుంటూ, పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉండటంతో పార్టీ కార్యక్రమాలు, ఇతర రాజకీయ కార్యకలాపాలకు కొంత విరామం ఇచ్చే అవకాశం ఉంది.
Also Read:UPI MDR వాయిదా..పేటీఎంషేర్ల పతనం
కేటీఆర్ అనారోగ్యానికి సంబంధించిన విషయం బయటకు రావడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.


