25 ఏళ్ల ప్రస్థానం..గణనాథుని సన్నిధిలో మోదీ

1
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని శ్రీ వినాయక మందిరాన్ని సందర్శించారు. బుధవారం ఉదయం ఆలయానికి వెళ్లిన ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుడి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం దేశ ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని మరోసారి చాటుకున్నారు.

2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. ఆ తర్వాత దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. గుజరాత్ సీఎంగా, అనంతరం ప్రధానమంత్రిగా ఇప్పటివరకు నిరంతరాయంగా ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ, ప్రజాసేవా ప్రయాణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని కేంద్ర కేబినెట్ ఇటీవల ప్రత్యేక తీర్మానం చేసింది. ప్రజల విశ్వాసంతో వరుసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ దేశానికి నాయకత్వం వహిస్తున్నారని కేబినెట్ ప్రశంసించింది. సంక్షేమం, మౌలిక వసతులు, సాంకేతికత, జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి రంగాల్లో ఆయన నాయకత్వాన్ని తీర్మానంలో ప్రస్తావించింది.

Also Read:కేటీఆర్‌ సాయంతో సైక్లింగ్‌లో స్వర్ణం

గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన కొన్ని కార్యక్రమాలు ఆ తర్వాత జాతీయ స్థాయిలో అమలు చేసిన విధానాలకు స్ఫూర్తిగా నిలిచాయని కేంద్రం పేర్కొంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే SWAGAT విధానం, ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించే PRAGATI వంటి కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది.

- Advertisement -