లండన్లో ఎన్నారై బీఆర్ఎస్ యూకే విస్తృత కార్యవర్గ సమావేశాన్ని అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యూకే వ్యాప్తంగా పనిచేస్తున్న కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్నారై బీఆర్ఎస్ యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు & ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు.ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు ఎన్నారై బీఆర్ఎస్ యూకే సభ్యుడు శ్రీనాథ్ రెడ్డి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.అనంతరం అటు అమరవీరులను, ప్రొఫెసర్ జయశంకర్ సార్ను స్మరించుకుని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
యూకేలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పలువురు తెలంగాణ ఎన్నారైలు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే కార్యదర్శి సురేష్ గోపతి స్వాగతోపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం, నవీన్ రెడ్డి దివంగత పెద్ది సుధర్షన్ రెడ్డి గారి సంతాప సందేశాన్ని అందించారు.శ్రీనాథ్ రెడ్డి అకాల మరణం పట్ల అశోక్ గౌడ్ సంతాప సందేశాన్ని తెలియజేశారు. మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ, యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు బీఆర్ఎస్లో చేరడం సంతోషకరమైన విషయమని తెలిపారు. కేసీఆర్–కేటీఆర్ గార్ల నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతోనే పార్టీలో చేరుతున్నామని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని భావిస్తున్నామని నూతన సభ్యులు పేర్కొన్నారు.
సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్–కేటీఆర్ గార్ల నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రజల పక్షాన బలమైన పోరాటం కొనసాగిస్తోందన్నారు. పార్టీ పోరాటాలకు సంఘీభావంగా యూకేలోని ఎన్నారై బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యక్రమాలతో పాటు, రానున్న రోజుల్లో లండన్లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా లండన్లో ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ ఎన్నారైలు పార్టీకి అందిస్తున్న సేవలను నూతన సభ్యులకు వివరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గార్లు తదితర పార్టీ నాయకత్వం ఎన్నారైలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అడ్వైజరీ బోర్డు చైర్మన్ సీకే చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఎన్నారై బీఆర్ఎస్ కార్యకర్తలు క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారని అన్నారు. అదే స్ఫూర్తి, క్రమశిక్షణతో భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రేతినేని రవి, సత్యమూర్తి చిలుముల & సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నారైలకు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించిన కెసిఆర్ గారికి సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ కేవలం రాజకీయ వేదిక మాత్రమే కాదని, సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి ఉంటామని, ఏ సమస్య వచ్చినా సంస్థ సభ్యులు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యక్రమాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ప్రజల తరఫున మరింత ఉత్సాహంతో పోరాటం కొనసాగిస్తామని, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పార్టీకి అండగా నిలుస్తామని తెలిపారు.
కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ, ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలను గణాంకాలతో సహా విశ్లేషిస్తూ ప్రశ్నిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు.
Also Read:రష్యాలో న్యుమోనిక్ ప్లేగ్ అనుమానిత కేసు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ, తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘డైవర్షన్ పాలిటిక్స్’కు పాల్పడుతున్నారని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే యువజన విభాగం కన్వీనర్ ప్రశాంత్ మామిడాల తీవ్రంగా విమర్శించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ డ్రామాలను రానున్న రోజుల్లో ఎండగడతామని ఆయన అన్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మైనారికీ సెల్ నాయకుడు అబ్దుల్ జఫర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే యువజన విభాగం కో-ఆర్డినేటర్ అమరేశ్వరి తెలిపారు.కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి,మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, అడ్వైజరీ బోర్డు చైర్మన్ సీకే చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు రవి కుమార్ రేటినేని, సత్యమూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, గణేష్ కుప్పాల, కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, అడ్వైజరీ బోర్డు సభ్యులు శ్రీధర్ రావు తక్కళ్ళపల్లి,ప్రవీణ్ వీర, కార్యదర్శులు అబూ జాఫర్, సురేష్ గోపతి, కోశాధికారి సురేష్ బుడగం, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, రాజేష్ వర్మ, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, శివ గౌడ్, యూత్ వింగ్ కార్యదర్శి ప్రశాంత్ మామిడాల, మెంబర్షిప్ కోఆర్డినేటర్ అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లునావత్, అమరేశ్వరి, లావణ్య, సాయి కిరణ్ కనుగుల, సాకేత్, జనార్దన్, స్నేహిత్ రావు, అనిల్ రాచమల్ల, సంకేత్ రెడ్డి, మణీందర్ రెడ్డి, శ్రీ హరి, జయపాల్ రెడ్డి, రాజు యాదవ్, అజయ్, రేవంత్, ప్రసన్న కుమార్, వికాస్ పర్రె, రాహుల్, మహేష్, అశ్వల్, శ్రీకాంత్, అస్లాన్, విజయ్, రమేష్ హర్షవర్ధన్, సతీష్ చంద్ర తదితర ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.

