క్యాజువల్‌ కాంట్రాక్ట్‌కు మైకేల్ బ్రేస్‌వెల్

1
- Advertisement -

న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2026-27 సీజన్‌కు సంబంధించి న్యూజిలాండ్ క్రికెట్ (NZC) సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి క్యాజువల్ కాంట్రాక్ట్‌కు మారాలని నిర్ణయించుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఆడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రేస్‌వెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

35 ఏళ్ల బ్రేస్‌వెల్ ఇప్పటివరకు న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్నాడు. తాజాగా క్యాజువల్ కాంట్రాక్ట్‌కు మారడంతో అతడి స్థానంలో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ బ్యాటర్ నిక్ కెల్లీకి చోటు దక్కింది.

క్యాజువల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, టిమ్ సీఫర్ట్‌లతో పాటు ఇప్పుడు బ్రేస్‌వెల్ కూడా చేరాడు.

ఈ నిర్ణయంపై బ్రేస్‌వెల్ స్పందిస్తూ.. కెరీర్‌లో ఈ దశలో ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు న్యూజిలాండ్ క్రికెట్ తనకు మద్దతు ఇవ్వడం ఎంతో ముఖ్యమని చెప్పాడు. తాను వైట్‌బాల్ క్రికెట్‌కే పరిమితమైన ఆటగాడినని, అందుకే ఈ అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేదని పేర్కొన్నాడు. అదే సమయంలో బ్లాక్ క్యాప్స్‌కు తన పూర్తి మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాడు. త్వరలో జరగనున్న భారత్ పర్యటనతో పాటు భవిష్యత్ వైట్‌బాల్ సిరీస్‌ల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.వచ్చే వేసవి నుంచి ప్రారంభం కానున్న తొలి NZ20 టోర్నీలోనూ ఆడాలని ఆసక్తిగా ఉన్నట్లు బ్రేస్‌వెల్ వెల్లడించాడు.

Also Read:రష్యాలో న్యుమోనిక్ ప్లేగ్ అనుమానిత కేసు..

- Advertisement -