ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించింది. పాకిస్థాన్‌తో జరుగుతున్న గోల్డ్ మెడల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత ఇన్నింగ్స్‌లో 211 పరుగులు చేయడంతో పాకిస్థాన్ ముందు 212 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 192 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో హాసన్ నవాజ్ 96 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో 19 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ 61, తిలకర్ వర్మ 51 పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
పాకిస్థాన్ జట్టు: సాహిబ్‌జాదా ఫర్హాన్ (కెప్టెన్), మాజ్ సదాఖత్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ దనియాల్, మహ్మద్ వసీమ్ జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ ముకీమ్, సాద్ మసూద్, అలీ రజా, అకీఫ్ జావేద్, హైదర్ అలీ.
భారత్ జట్టు: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్.
Also Read:యువీ రికార్డును సమం చేసిన అభిషేక్

