దృశ్యం 3 ఫస్ట్ డే కలెక్షన్స్..

6
- Advertisement -

అజయ్ దేవగణ్ నటించిన ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మూడో, చివరి భాగంగా తెరకెక్కింది. తొలి రోజే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన లభించింది. అంతేకాకుండా అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.

‘దృశ్యం 3’ భారత్‌లో తొలి రోజు రూ.66.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ రూ.80.10 కోట్లుగా ఉండగా.. ఓవర్సీస్‌లో రూ.15 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు మొత్తం రూ.95.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. తొలి రోజున ఈ సినిమా 15,759 షోలలో ప్రదర్శితమైంది. మొత్తం 67.08 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలకు 46.38 శాతం ఆక్యుపెన్సీ ఉండగా.. మధ్యాహ్నానికి అది 70.15 శాతానికి చేరింది. సాయంత్రం షోల్లో 75.31 శాతం, నైట్ షోల్లో 76.46 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

‘దృశ్యం 3’తో అజయ్ దేవగణ్ తన కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ను నమోదు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు ‘సింగం ఎగైన్’ పేరిట ఉండేది. ఆ సినిమా తొలి రోజు భారత్‌లో సుమారు రూ.43.5 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ‘సింగం రిటర్న్స్’ రూ.32.1 కోట్లు, ‘గోల్‌మాల్ ఎగైన్’ రూ.30.15 కోట్లు, ‘రైడ్ 2’ రూ.19.25 కోట్లతో అజయ్ దేవగణ్ కెరీర్‌లోని ప్రధాన ఓపెనర్లుగా నిలిచాయి.

Also Read:యువీ రికార్డును సమం చేసిన అభిషేక్

తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.95.10 కోట్ల వసూళ్లతో ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ 2026లో ఇప్పటివరకు రెండో అతిపెద్ద హిందీ ఓపెనర్‌గా నిలిచినట్లు సాక్‌నిల్క్ గణాంకాలు సూచిస్తున్నాయి. ‘ధురంధర్ 2’ రూ.226.6 కోట్ల వరల్డ్‌వైడ్ ఓపెనింగ్‌తో ఈ జాబితాలో ముందుంది.

- Advertisement -