జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే!

10
- Advertisement -

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)పై సినీ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు. SIR ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. SIRపై తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ప్రకాశ్ రాజ్ కొంతకాలంగా కర్ణాటకలో పర్యటిస్తూ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

గణేష్ నిమజ్జనం పూర్తయిందని, ఇక జ్ఞానేష్ నిమజ్జనం మిగిలి ఉందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వైదొలగాలన్న తన డిమాండ్‌ను ఆయన మరోసారి స్పష్టం చేశారు.

SIR ప్రక్రియపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, చిరునామాలు లేదా వివరాల్లో మార్పులు వంటి అంశాలపై ప్రజల్లో ఆందోళనలు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే మరోసారి ఇంత విస్తృతమైన ఓటర్ల జాబితా సవరణ చేపట్టాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. SIRను పూర్తిగా నిలిపివేయాలని, ఎన్నికల ప్రక్రియపై సమగ్ర పరిశీలన జరగాలని కోరుతున్నారు.

Also Read:యువీ రికార్డును సమం చేసిన అభిషేక్

ఇదే సమయంలో SIRకు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. SIRపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

- Advertisement -