తమిళ స్టార్ విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జులై 31న విడుదల కావాల్సిన ఈ సినిమాను విజయ్ నటించిన ‘జన నాయకన్’తో క్లాష్‌ను నివారించేందుకు వాయిదా వేసి అక్టోబర్ 2న రిలీజ్ చేశారు. తమిళం, తెలుగులో విడుదలైన ఈ యాక్షన్ కామెడీ హీస్ట్ థ్రిల్లర్‌కు తొలి రోజు మోస్తరు స్పందన లభించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
‘సిగ్మా’ తొలి రోజు భారత్‌లో రూ.2.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొత్తం 1,813 షోల ద్వారా 31.1 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఇండియా గ్రాస్ కలెక్షన్ రూ.2.70 కోట్లుగా ఉంది. ఇందులో తమిళ వెర్షన్ రూ.1.50 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.85 లక్షల నెట్ వసూళ్లు సాధించాయి.
ప్రాంతాల వారీగా చూస్తే తమిళనాడు నుంచి అత్యధికంగా రూ.1.30 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రూ.1 కోటి వసూలైనట్లు సమాచారం. కర్ణాటకలో రూ.25 లక్షలు, కేరళలో రూ.12 లక్షలు, మిగతా ప్రాంతాల నుంచి రూ.3 లక్షల గ్రాస్ కలెక్షన్ నమోదైంది. వీకెండ్ కావడంతో రాబోయే రోజుల్లో వసూళ్లు పెరుగుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జేసన్ సంజయ్ అందించారు. అజయ్ అశోక్, కలీల్ రాజా, ఎస్. సంజీవ్ సహ రచయితలుగా వ్యవహరించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ. సుభాస్కరన్ నిర్మించగా.. ఎస్. థమన్ సంగీతం అందించారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
Also Read: యువీ రికార్డును సమం చేసిన అభిషేక్

