భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో రైలు టికెట్లకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. సెప్టెంబర్ 7న ఒకే రోజులో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా దాదాపు 22 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయి రికార్డు సృష్టించడమే దీనికి ఉదాహరణ.
సాధారణంగా ప్రయాణికులు అడ్వాన్స్ రిజర్వేషన్ లేదా తత్కాల్ (Tatkal) విధానంలో టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, ప్లానింగ్ లేకుండా ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు లేదా తత్కాల్‌లో టికెట్ దొరకనప్పుడు ఏం చేయాలి? రైలు చార్ట్ తయారైన (Chart Preparation) తర్వాత కూడా టికెట్ పొందేందుకు భారతీయ రైల్వే ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది.
రైలు బయలుదేరడానికి ముందు మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత కూడా ఖాళీగా ఉన్న సీట్లను లేదా బెర్త్ లను బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉండే విధానాన్నే ‘కరెంట్ బుకింగ్’ అంటారు. వాస్తవానికి రైలు బయలుదేరడానికి సుమారు 4 గంటల ముందు మొదటి చార్ట్ తయారు చేస్తారు. చార్ట్ సిద్ధమైన తర్వాత రైలులోని ఖాళీ సీట్ల వివరాలను సిస్టమ్‌లో కరెంట్ బుకింగ్ కోసం అందుబాటులో ఉంచుతారు.
టికెట్ దొరికే మార్గాలు:
ఆన్‌లైన్: IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నేరుగా బుక్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్: రైల్వే స్టేషన్‌లోని ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్ (PRS) వద్ద కూడా కరెంట్ టికెట్ పొందవచ్చు.
కరెంట్ బుకింగ్‌లో టికెట్ చార్జీలపై రైల్వే కొంత రాయితి లేదా బేసిక్ ఫేర్‌లో డిస్కౌంట్ (సుమారు 10%) అందిస్తుంది.కరెంట్ బుకింగ్ ద్వారా లభించే టికెట్లు నేరుగా కన్ఫర్మ్డ్ (Confirmed) బెర్త్‌లుగానే ఉంటాయి. ఇందులో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఇవ్వబడవు.
Also Read:BB10:రెడ్ టీంకు బంపర్ ఆఫర్
రైలు బయలుదేరే సమయం వరకు: రైలు ప్రారంభ స్టేషన్ నుండి బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు లేదా రెండవ చార్ట్ తయారయ్యే వరకు ఈ కరెంట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

