దసరా పండగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ఈసారి ఒకే రోజున రెండు భిన్నమైన కథాంశాలతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. గతంలో ఈ కాంబినేషన్‌కు మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీనిధి శెట్టి, నివేధా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘నారాయణమ్మ’ పాటకు మంచి స్పందన వస్తోంది.
ఇదే తేదీన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990ల ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంతో తెరకెక్కినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో శ్రీవిష్ణు థియేటర్ యజమాని పాత్రలో కనిపించనున్నాడు. విభిన్న కథలు, కంటెంట్ ఆధారిత చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపైనా ఆసక్తి నెలకొంది.
అలాగే దసరా కేసులో జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి వంటి చిత్రాలు కూడా బరిలో ఉండటంతో ఈసారి పోటీ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ‘ఆదర్శ కుటుంబం’తో పోటీ పడేందుకు ‘కామ్రేడ్ కళ్యాణ్’ రెడీ కాగా దసరా రేసులో ఎవరు గెలుస్తారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
Also Read:BB10:రెడ్ టీంకు బంపర్ ఆఫర్

