భారతదేశ రెండో ప్రధాని, నిరాడంబరతకు, నిజాయితీకి నిలువెత్తు రూపం లాల్ బహదూర్ శాస్త్రి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. క్లిష్ట సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించిన ఆయన సేవలను స్మరించుకుంటూ ఈ ప్రత్యేక రోజున శుభాకాంక్షలు చెబుతారు.
లాల్ బహదూర్ శాస్త్రి ప్రసిద్ధ సూక్తులు (Quotes):
“జై జవాన్.. జై కిసాన్” — దేశాన్ని కాపాడే సైనికుడు, అన్నం పెట్టే రైతు ఈ దేశానికి వెన్నెముకలు.
“సమస్యల ముందు తలవంచడం కాదు.. దేశ ప్రయోజనాల కోసం దృఢ సంకల్పంతో ముందడుగు వేయడమే నిజమైన నాయకత్వం.”
“మన దేశానికి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, దాన్ని నిలబెట్టుకోవడానికి క్రమశిక్షణ, కష్టం అంతే అవసరం.”
“శాంతి కోసం మనం ఎంతైనా శ్రమిస్తాం, కానీ దేశ గౌరవానికి భంగం వాటిల్లితే రాజీపడే ప్రసక్తే లేదు.”
నిరాడంబరత, నిజాయితీలకు ప్రతిరూపమైన భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి ప్రణామాలు!
‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో కోట్లాదిమంది భారతీయుల్లో దేశభక్తిని రగిలించిన అమరనేత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు.
శాస్త్రి ఆదర్శాలు, ఆశయాలు నేటి యువతకు ఎల్లప్పుడూ మార్గదర్శకం. అందరికీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు!
దేశ సేవలో తన జీవితాన్ని ధారపోసిన లాల్ బహదూర్ శాస్త్రి గారి దివ్య స్మృతికి నివాళులు అర్పిస్తూ.. శాస్త్రి జయంతి శుభాకాంక్షలు!
Also Read:ఇంటర్నేషనల్ కాఫీ డే..ప్రత్యేకం
1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరాయ్‌లో జన్మించిన శాస్త్రి స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. భారతదేశం తీవ్రమైన ఆహార కొరత మరియు 1965 నాటి యుద్దాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, దేశాన్ని విజయపథంలో నడిపించారు. ఆయన చూపిన నిబద్ధత, నిరాడంబర జీవితం నేటికీ కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకం.

