రేవంత్‌పై హరీష్ రావు సెటైర్లు

7
- Advertisement -

సిద్దిపేట జిల్లా పర్యటనకు వచ్చేందుకు అంతమంది పోలీసులు, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, డ్రోన్ కెమెరాల కాపలా ఎందుకని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తనీషీల్ హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతమంది పోలీసులను పెట్టుకుని, భయపడుతూ సిద్దిపేటకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.

పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం భద్రత పేరుతో హడావుడి చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నా ఇంటికి వస్తే కడుపునిండా భోజనం పెట్టి, నేనే దగ్గరుండి నా తోట అంతా తిప్పి చూపిస్తా కదా…సిద్దిపేటకు రావడానికి ఇన్ని కార్లు, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, డ్రోన్ కెమెరాలు ఎందుకు? నేను ఇక్కడే ఉన్నా.. నాకు ముందుగా చెబితే అన్ని ఏర్పాట్లు చేసి, మంచిగా కడుపునిండా అన్నం తినిపించి, దగ్గరుండి నా తోట అంతా చూపిస్తా. అంతమంది పోలీసులను పెట్టుకుని అంత భయపడుతూ రావాల్సిన అవసరం ఏముంది? చెప్పాలన్నారు.

సిద్దిపేట ప్రజలు శాంతియుతంగా ఉండే వారని, అభివృద్ధినే కోరుకుంటారని పేర్కొన్న ఆయన, భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. హామీలను నెరవేర్చడంలో విఫలమైనందునే ప్రభుత్వం ప్రజలను చూసి భయపడుతోందని, అందుకే ఇలాంటి అదనపు భద్రతా చర్యలు చేపడుతోందని ఆరోపించారు.

Also Read:నానితో కయాదు లోహార్..

- Advertisement -