ఐఫోన్ 18 ప్రొ మరియు ఐఫోన్ 18 ప్రొ మాక్స్ అధికారిక విక్రయాల ప్రారంభం సందర్భంగా ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ యాపల్ స్టోర్ వెలుపల తెల్లవారుజాము నుంచే అభిమానులు, కస్టమర్లు క్యూ కట్టారు.
ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) లోని యాపల్ అధికారిక స్టోర్‌లో సందడి చేశారు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్. సేల్స్ ప్రారంభం రోజున నేరుగా స్టోర్‌ను సందర్శించి, సరికొత్త ఐఫోన్ 18 (iPhone 18) ని కొనుగోలు చేసి అన్‌బాక్స్ చేశారు విక్కీ .
ఆపిల్ స్టోర్‌లో ఉన్న అభిమానులతో, కొనుగోలుదారులతో చిరునవ్వుతో సంభాషించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. విక్కీ కౌశల్ ఐఫోన్ 18 డివైజ్‌ను అన్‌బాక్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సరికొత్త ఐఫోన్ సిరీస్ పరికరాలను దేశంలోనే తొలిరోజు దక్కించుకునేందుకు వందలాది మంది డివైజ్ ప్రేమికులు గంటల తరబడి నిరీక్షణగా ఎదురుచూస్తుండగా కొత్త కలర్స్, అధునాతన కెమెరా, లేటెస్ట్ A20 ప్రొ చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ మోడళ్ల కొనుగోలుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
Also Read:నానితో కయాదు లోహార్..
ముంబై బిసికెతో పాటు ఢిల్లీలోని యాపల్ సాకేత్ స్టోర్‌లో మరియు ఇతర అధికారిక రీసెల్లర్ కేంద్రాల్లో కూడా నేటి నుంచే ఐఫోన్ 18 ప్రొ సిరీస్ విక్రయాలు అందుబాటులోకి వచ్చాయి.

