TTD:తప్పుడు వార్తలు నమ్మవద్దు

8
- Advertisement -

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరిపీచు ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఖండించింది. ఇటువంటి పోస్టులు పూర్తిగా ఆధారరహితమైనవని, బాధ్యతారాహిత్యమైనవని స్పష్టం చేస్తూ వివరణ ఇచ్చింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సర్క్యులేట్ అవుతున్న ఫోటో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించినది కాదని టీటీడీ స్పష్టం చేసింది.

సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నిష్ఠతో లడ్డూల తయారీని చేపడతారని, తయారీ విధానంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని టీటీడీ నొక్కి చెప్పింది.

Also Read:పిల్లలలో డెంగ్యూ..అపోహలపై క్లారిటీ

ఇలాంటి అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే, విద్వేషపూరిత కంటెంట్‌ను వ్యాప్తి చేసే వారిపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Also Read:నానితో కయాదు లోహార్..

భక్తులు కేవలం అధికారిక టీటీడీ సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.

- Advertisement -