బిగ్ బాస్ సీజన్ 10 పదో ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ గేమ్స్, క్యూట్ ఫ్లర్టింగ్‌తో ఆసక్తికరంగా సాగింది. నామినేషన్ల వేడి చల్లారకముందే ఇంట్లో కంటెస్టెంట్లు తమ వ్యూహాలకు పదును పెట్టగా, మరోవైపు లవ్ ట్రాక్ వాతావరణాన్ని కాస్త కూల్ చేసింది.
మంగళవారం ఎపిసోడ్‌లో నామినేషన్ల రచ్చపై త్రిగుణ్ తనదైన స్టైల్లో కవర్ చేసే ప్రయత్నం చేశాడు. సృష్టిని ‘గోడమీద పిల్లి’ అని అన్న వ్యాఖ్యలపై సుధీర్ వేలెత్తి చూపడంతో, త్రిగుణ్ ఆమె దగ్గరకు వెళ్లి.. “నేను ఆ మాటను ఒక ఆయుధంలా వాడాను తప్ప నిన్ను తక్కువ చేయడానికి కాదు” అంటూ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశాడు. దీనిపై సుధీర్ మొహం కూడా చూడనంటూ త్రిగుణ్ శపథం చేయడం గమనార్హం.
మరోవైపు రోహిత్, షాలినిల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. త్రిగుణ్ పక్కా హోం వర్క్ చేసి వచ్చాడని, టాప్ 5లో ఉంటాడని రోహిత్ జోస్యం చెప్పాడు. “ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, ఎవరిని గెలికితే మైలేజ్ వస్తుంది, ఎవరితో ఎలాంటి గేమ్ ఆడాలి అని ముందే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను. త్రిగుణ్ నాకు ప్రత్యర్థిగా ఉన్నప్పుడే నా అసలు గేమ్ బయటకు వస్తుంది. ముఖ్యంగా త్రిగుణ్-వర్షిణి, త్రిగుణ్-ముకేష్ ల మధ్య గొడవలు జరిగితేనే అసలైన మజా వస్తుంది” అని రోహిత్ తన ప్లాన్స్ బయటపెట్టాడు.
ఇక ఈ ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది దేబ్జానీ, ముకేష్‌ల లవ్ ట్రాక్. వీకెండ్‌లో నాగార్జున ముందే “నాకు ముకేష్ అంటే ఇష్టం, అతని కళ్లు చాలా బావుంటాయి” అని చెప్పిన దేబ్జానీ, నేటి ఎపిసోడ్‌లోనూ తన ఫ్లర్టింగ్‌ను కొనసాగించింది.
వర్షిణితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా గడిపి వచ్చిన ముకేష్, దేబ్జానీని చూసి పొరపాటున ‘వర్షిణీ’ అని పిలిచాడు. దాంతో అలిగిన దేబ్జానీ, “నేను నీకు వర్షిణిలా కనిపిస్తున్నానా?” అంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత “నేను నాగ్ సార్ ముందే చెప్పాను కదా.. నువ్వంటే నాకు ఇష్టమని” అంటూ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టింది.
అంతటితో ఆగకుండా, “మరొక అమ్మాయితో కలిసి బట్టలు లేకుండా స్విమ్మింగ్ పూల్‌లో దిగుతావా? నేను త్రిగుణ్‌కి కాఫీ మాత్రమే ఇచ్చాను, కానీ నువ్వు పూల్‌లోకి దిగావు” అంటూ సరదాగా అరిచి హంగామా చేసింది. రాం ప్రసాద్ మధ్యలో కల్పించుకుని “వీడు మా చెల్లికే అన్యాయం చేస్తున్నాడు” అని పంచ్ వేయడంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. “తర్వాత కొత్తవాళ్లు వస్తారుగా, నేను కూడా వేరే వాళ్లతో పూల్‌లో దిగి చూపిస్తా” అంటూ దేబ్జానీ క్యూట్‌గా హెచ్చరించింది.
Also Read:అమెరికాకు లొంగిపోయిన మోదీ!
మొత్తానికి వీరిద్దరి మధ్య సాగుతున్న ఈ సరదా ట్రాక్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. రాబోయే రోజుల్లో బిగ్ బాస్ ఈ జోడీని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.

