తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అలర్ట్

1
- Advertisement -

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు భారత వాతావరణ శాఖ (IMD) బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల పాటు ఇరు రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Yellow Alert) ప్రకటించింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ప్రభావం చూపనున్న ముఖ్య ప్రాంతాలు:

ఉత్తర తెలంగాణ జిల్లాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్

ఇతర ప్రభావిత ప్రాంతాలు: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం

Also Read:అమెరికాకు లొంగిపోయిన మోదీ!

ఈ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు.వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద లేదా కరెంట్ స్తంభాల వద్ద నిలబడకూడదు….వాహనదారులు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -