రెస్టారెంట్ లేదా స్ట్రీట్ ఫుడ్ శైలిలో ఘుమఘుమలాడే చికెన్ నూడుల్స్‌ను ఇంట్లోనే సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా. కావలసిన పదార్థాలు…నూడుల్స్: 1 ప్యాకెట్ (హక్కా లేదా ఎగ్ నూడుల్స్) బోన్‌లెస్ చికెన్: 200 గ్రాములు (సన్నని ముక్కలుగా కోసినవి)కూరగాయలు: క్యాప్సికం, క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయలు (సన్నగా పొడవుగా తరిగినవి) అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్ సాస్‌లు: సోయా సాస్ (1 టేబుల్ స్పూన్), రెడ్ చిల్లీ సాస్ (1 టేబుల్ స్పూన్), వెనిగర్ (1 టీస్పూన్) పోడి మసాలాలు: మిరియాల పొడి, గరం మసాలా లేదా చికెన్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు నూనె: సరిపడా గార్నిష్ కోసం: స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు)
తయారీ విధానం..
నూడుల్స్ ఉడకబెట్టడం:ముందుగా ఒక పెద్ద పాత్రలో నీటిని మరిగించి, కొద్దిగా ఉప్పు, టీస్పూన్ నూనె వేసి నూడుల్స్ ఉడికించాలి. నూడుల్స్ 80% ఉడికిన తర్వాత నీటిని వడకట్టి, చల్లటి నీళ్లతో కడిగి పక్కన పెట్టుకోవాలి (ఇలా చేస్తే నూడుల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి).
చికెన్ వేయించడం:సన్నగా కోసిన బోన్‌లెస్ చికెన్‌లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్ కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత బాణలిలో కొద్దిగా నూనె వేసి చికెన్ ముక్కలను రంగు మారే వరకు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
కూరగాయలు వేయించడం:అదే కడాయిలో మరికొంచెం నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీ ముక్కలను పెద్ద మంటపై 2 నిమిషాలు ఫ్రై చేయాలి. కూరగాయలు పూర్తిగా ఉడకకుండా కరకరలాడేలా ఉండాలి.
సాస్‌లు & నూడుల్స్ కలపడం:ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, మిరియాల పొడి మరియు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన నూడుల్స్ వేసి పెద్ద మంట మీద బాగా టాస్ చేయాలి. చివరగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ నూడుల్స్ సిద్ధం!
Also Read:ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు..నటి ఫిర్యాదు!

