శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం!

1
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి అధికారికంగా ఆహ్వానించింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ బృందం ఆయనను కలిసింది.

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకిదేవిలతో పాటు ఈవో ముద్దాడ రవిచంద్ర సీఎం చంద్రబాబును కలసి బ్రహ్మోత్సవాల అధికారిక ఆహ్వాన పత్రికను, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి మంత్రోచ్ఛారణల మధ్య వేదాశీర్వచనం అందించారు.

తిరుమలలో నిర్వహించనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్, ఈవోలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. బ్రహ్మోత్సవాలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తాగునీరు, వసతి, క్యూలైన్ల నిర్వహణ, భద్రత, మరియు ఉచిత అన్నప్రసాద వితరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.

Also Read:ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు..నటి ఫిర్యాదు!

సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాల తొలిరోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుండి 23 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి.

- Advertisement -