తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌పై నటుడు అజిత్ కుమార్ ప్రశంసలు కురిపించారు. విజయ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.చెన్నైలో ప్రపంచ స్థాయి ‘తమిళనాడు ఒలింపిక్ సిటీ’తో పాటు మోటార్ స్పోర్ట్స్ సిటీని నిర్మించనున్నట్లు సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రకటించడంపై అజిత్ ధన్యవాదాలు తెలిపారు.
క్రీడల్లో యువతను ప్రోత్సహించడానికి, వారి ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించడానికి తమిళనాడు ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడతాయని అజిత్ అన్నారు. “ప్రస్తుతం నేను మోటార్ స్పోర్ట్స్‌లో పాల్గొంటున్నాను.
వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాటలను కొద్దిగా మార్చి చెప్తున్నాను — ‘తమిళనాడు ప్రభుత్వం వేసిన ఈ ఒక్క చిన్న అడుగు, భారతదేశ మోటార్ స్పోర్ట్స్ రంగానికి ఒక పెద్ద ముందడుగు!’ గౌరవనీయ ముఖ్యమంత్రి తిరు సి. జోసెఫ్ విజయ్ కి ఆయన చేపడుతున్న అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని అజిత్ పేర్కొన్నారు.
Also Read:ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు..నటి ఫిర్యాదు!

