GIC:శ్రీముఖికి ‘విత్తన గణపతి’ అందజేత

2
- Advertisement -

మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (GIC) వ్యవస్థాపకులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆశయాలతో రూపొందించిన పర్యావరణ హిత ‘విత్తన గణపతి’ (Seed Ganesha) విగ్రహాన్ని ప్రముఖ వ్యాఖ్యాత (యాంకర్) శ్రీముఖికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ నుతికడి భోజనారాయణ అందజేశారు.

వినాయక చతుర్థి వేడుకల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) మరియు రసాయన రంగులతో తయారుచేసిన విగ్రహాల వల్ల నదులు, చెరువులు కలుషితమవుతున్నాయని, వాటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతికి మేలు చేసే విత్తన గణపతులను పూజించాలని GIC పిలుపునిచ్చింది.

సహజ సిద్ధమైన మట్టి, కోకోపీట్‌తో తయారుచేసిన ఈ విత్తన గణపతిని పూజించిన అనంతరం ఇంట్లోనే కుండీలో లేదా నేలలో నిమజ్జనం చేయవచ్చు.విగ్రహం మట్టిలో కరిగిపోయాక అందులోని విత్తనం మొలకెత్తి పచ్చని మొక్కగా మారుతుంది. తద్వారా వినాయకుడే స్వయంగా ఒక జీవమున్న మొక్కగా మారి ఆ ఇంటిని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడని GIC ప్రతినిధులు పేర్కొన్నారు.

పర్యావరణాన్ని కాపాడుతూ, భక్తితో పాటు పచ్చదనాన్ని పెంపొందించే ఈ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, విత్తన గణపతిని పూజించి ప్రకృతిని రక్షించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Also Read:అసెంబ్లీ నుండి BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్

- Advertisement -