ఇరాన్‌తో జరుగుతున్న వివాదంలో విజయం సాధించిన తర్వాత చమురు ధరలు వేగంగా తగ్గుతాయని, గ్యాసోలిన్ (పెట్రోల్) ధరలు గాలన్‌కు 2 డాలర్ల కంటే కిందకు పడిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న సైనిక చర్యల వల్లే ఇంధన ధరలు పెరుగుతున్నాయని, ఈ యుద్ధం ముగియగానే మార్కెట్లు త్వరగా స్థిరపడతాయని తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.
ఇరాన్‌తో యుద్ధంలో మనం గెలిచినప్పుడు, ఇతర ధరలన్నీ తగ్గినట్లే (అంతకంటే ఎక్కువగా!) చమురు ధరలు కూడా వేగంగా తగ్గుతాయి. గాలన్‌కు మూడు డాలర్లు, ఆ తర్వాత రెండూ డాలర్ల కంటే కిందకు పడిపోతాయి అని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని తయారు చేయకుండా అడ్డుకుంటామని ట్రంప్ పునరుద్ఘాటించారు. “ఇదంతా చాలా వేగంగా జరుగుతుంది, ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణు ఆయుధం ఉండదు అని పేర్కొన్నారు.
ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు వ్యాపారం జరిగే కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరం కావడంతో సోమవారం చమురు ధరలు ఆరు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 97 డాలర్లకు పెరిగింది.
ఇరాన్ ఇంధన వనరులపై దాడికి దిగవద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ గాలిబాఫ్ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. మా చమురు, గ్యాస్ ఉత్పత్తి వ్యవస్థ చాలా విస్తృతమైనది మరియు అందరికీ అందుబాటులో తెరిచి ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న అమెరికా చమురు, గ్యాస్ కంపెనీలకు కూడా ఇదే ముప్పు వర్తిస్తుంది. మా వనరులపై దాడి చేస్తే మీ వనరులపైనా దాడి జరుగుతుంది. మేము ఇప్పటికే దీన్ని నిరూపించాము అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Also Read:వాకింగ్ చేస్తున్నా బ్లడ్ షుగర్ పెరుగుతోందా?

