ఇది ‘గౌరవ’ సభ కాదు ‘కౌరవ’ సభ!

5
- Advertisement -

సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికి, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి యావత్ మహిళా లోకాన్ని అవమానించారు..ఇది గౌరవ సభ కాదు ‘కౌరవ సభ’.. రేవంత్ రెడ్డి కలియుగ దుశ్శాసనుడు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.దాడికి గురైన మహిళా ఎమ్మెల్యేలపైనే రివర్స్‌లో కేసులు పెడతారా? ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా తయారైంది పోలీసుల తీరు…స్పీకర్ గారి పట్ల మాకు పూర్తి గౌరవం ఉంది.. మా సభ్యుడు క్షమాపణ చెప్పినా కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఒకే తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు.

దళితులపై కాంగ్రెస్‌కు నిజంగా ప్రేమ ఉంటే.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది? అంబేద్కర్ విగ్రహానికి తాళాలు ఎందుకు వేశారు? చెప్పాలన్నారు. మహిళా శాసనసభ్యుల మీద జరిగిన దాడిని పోలీసులు పరిశీలిస్తారని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం విడ్డూరంగా ఉంది…శ్రీధర్ బాబు గారికి కూడా అక్కాచెల్లెళ్లు ఉన్నారు.. సొంత అక్కాచెల్లెళ్ల మీద ఇలాంటి దారుణమైన దాడి జరిగితే కేవలం పరిశీలిస్తాం అని సరిపెట్టుకుంటారా..ఆయన నుంచి కనీస సానుభూతి, విచారం ఆశించాం కానీ అది జరగలేదు అన్నారు.

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పై మగ పోలీసులు దాడి చేశారు, ఆమె గొంతు పిసికారు.. ఇదంతా వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది…మరో మాజీ మంత్రి, మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారి చీర లాగడంతో ఆమె కన్నీరు పెట్టుకున్న దృశ్యాలను మనమంతా చూశాం…ఇంత దారుణం జరిగినా ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరగలేదు. సీపీకి, పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తే.. న్యాయం చేయాల్సింది పోయి, దాడికి గురైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి గారి మీదే రివర్స్‌లో కేసులు నమోదు చేశారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా తయారైంది పోలీసుల తీరు…ఇది కేవలం బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి కాదు, రాష్ట్రంలోని యావత్ మహిళా లోకంపై జరిగిన దాడి అన్నారు.

వాళ్లను తీవ్రంగా కించపరిచారు. ఇదెక్కడి పద్ధతి స్పీకర్…మీరే మమ్మల్ని కాపాడాలి, మీరే మా రెస్క్యూకి రావాలి..ఈ అసెంబ్లీ ఇప్పుడు గౌరవ సభ కాదు, కౌరవ సభగా మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలియుగ దుశ్శాసనుడిలా మారారు. ఆనాడు మహాభారతంలో కౌరవులకు పట్టిన గతే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుంది.స్పీకర్ గారు, మీరంటే మాకు ఎంతో గౌరవం. వ్యక్తిగతంగా మీ పట్ల మాకు ఉన్న గౌరవాభిమానాలు ఎంతటివో మీ మనసుకు కూడా తెలుసు. నిన్న జరిగిన ఘటనలో మా గౌరవ సభ్యుడు తాతా మధు ఆ మాటలను స్పీకర్ గారిని ఉద్దేశించి అనలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అలా భావించి ఉంటే ఆ పదాలను విత్‌డ్రా చేసుకుంటున్నానని, విచారం వ్యక్తం చేస్తున్నానని లిఖితపూర్వకంగా మీడియా ముఖంగా క్షమాపణలు కూడా చెప్పారు.మీరంటే మాకు ఎనలేని అభిమానం. మీరు నొచ్చుకుని ఉంటే పార్టీ తరఫున మేం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. సభ్యుడు సారీ చెప్పినా, విచారం వ్యక్తం చేసినా.. కక్షపూరితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారో వేయండి, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.ఈ ప్రభుత్వానికి దళిత, గిరిజనుల మీద నిజంగా అంత ప్రేమే ఉంటే.. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయడం లేదు.. జాతి గర్వపడేలా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తాళాలు ఎందుకు వేశారు.. రేవంత్ రెడ్డికి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు.

Also Read:BB10 హౌస్‌లోకి బాలు-మీనా!

- Advertisement -