ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్యనికేతన్ వీధిలో ఉన్న ఐదంతస్తుల (50 ఏళ్ల నాటి) బాలుర పేయింగ్ గెస్ట్ (PG) భవనం ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో వెంటనే భారీ ఎత్తున సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఢిల్లీ పోలీసులతో పాటు ఇతర సంస్థల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు మరియు శిథిలాలను తొలగించేందుకు రంగంలోకి దిగాయి.
భవనం ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. భవనం కొద్ది సెకన్లలోనే నేలమట్టమవ్వడం, భారీగా దుమ్ము ధూళి ఎగసిపడటం ఆ వీడియోలో కనిపిస్తుంది.కూలిపోయిన భవనానికి ఎదురుగా ఉన్న షాపు వద్ద అమర్చిన సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఒక దుకాణదారుడు తృటిలో ప్రాణపాయం నుండి తప్పించుకున్నాడు. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు అతను తన షాపు బయట కూర్చుని ఉన్నాడు. భవనం ఒక్కసారిగా కూలిపోయి ఆ ప్రాంతమంతా దట్టమైన దుమ్ము అలముకోవడంతో అతను తన ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుండి వేగంగా పరుగులు తీశాడు.
మరొవైపు, సత్యనికేతన్లో భవనం కూలిన ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిందని, భవనం యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించిందని శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపింది.
#WATCH | Delhi: CCTV footage from the building collapse site in Satya Niketan of Delhi’s South-West district. Six people have lost their lives.
(Source: Local Resident) pic.twitter.com/7MtDbb3pJF
— ANI (@ANI) September 7, 2026

