BSP:ఒంటరిగానే బరిలోకి

1
- Advertisement -

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి రాబోయే ఎన్నికల వ్యూహంపై కీలక ప్రకటన చేశారు. 2027లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే అన్ని చిన్న, పెద్ద ఎన్నికలలో బిఎస్‌పి ఏ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగానే (ఒంటరిగానే) పోటీ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

గతంలో ఇతర పార్టీలతో పొత్తుల వల్ల తమ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు మారుతోందే తప్ప, బిఎస్‌పి ఓట్లు పొత్తు పెట్టుకున్న పార్టీలకు బదిలీ అవుతున్నాయని, కానీ ఆ పార్టీల ఓట్లు బిఎస్‌పికి రావడం లేదని మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇకపై ఎవరితోనూ కూటమి కట్టే ప్రసక్తి లేదని తెలిపారు. లక్నోలో పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆమె.. కేడర్‌ను గ్రౌండ్ లెవెల్ నుండి బలోపేతం చేయాలని ఆదేశించారు.

దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు మరియు ముస్లిం వర్గాలను ఏకం చేయడం ద్వారా బిఎస్‌పి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ (SP), భారతీయ జనతా పార్టీ (BJP) మరియు కాంగ్రెస్‌లు తమ స్వార్థ రాజకీయాల కోసం బహుజన్ సమాజ్ ప్రయోజనాలను బలి చేస్తున్నాయని, రాజ్యాంగ సూత్రాలను కాపాడడంలో విఫలమయ్యాయని ఆమె విమర్శించారు.

Also Read:కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం

- Advertisement -