కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఛార్జ్ షీట్

1
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, వారి వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… తెలంగాణ భవన్‌లో ప్రత్యేక “ఛార్జ్‌షీట్” విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గత 1000 రోజుల పాలనలో ఏకంగా నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. అంత పెద్దమొత్తంలో రుణాలు తెచ్చినప్పటికీ, రాష్ట్రంలో ఒక్క కొత్త ఇటుక పెట్టలేదని, ఒక్క చెక్‌డ్యామ్ కూడా నిర్మించలేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారని, సొంతంగా సాధించిన అభివృద్ధి ఒక్కటి కూడా లేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, అరాచకం పరాకాష్ఠకు చేరాయని కేటీఆర్ మండిపడ్డారు.ఎంగిలి విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్లు.. రాష్ట్ర సంపాదన మరియు లూటీ కోసం మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పరం తన్నుకుంటున్నారు అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన “అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐ మ్యాక్స్” రేంజ్‌లో ఉందంటూ ఎద్దేవా చేశారు.

ఈ ఛార్జ్‌షీట్ విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్యలతో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సురభి వాణిదేవి, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాలోత్ కవిత, కేఆర్ సురేష్ రెడ్డి మరియు పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Also Read:IRGC:రెండోరోజు వైమానిక దాడులు

- Advertisement -