- Advertisement -
భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపాల్ ప్రజలను నేరుగా పరామర్శించి ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ కాఠ్‌మాండు చేరుకున్నారు .
వరద బాధితుల కోసం భారతదేశం నుంచి ప్రత్యేకంగా తెచ్చిన ఆహార పదార్థాలు, దుప్పట్లు మరియు నిత్యావసరాలను పంపిణీ చేయడంతో పాటు, వారి జీవితాలు సాధారణ స్థితికి వచ్చేవరకు రాబోయే నెలల్లో సహాయం అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిరాశ్రయులైన పిల్లలు, కుటుంబాలతో సమయం గడిపి సోనూసూద్ వారికి కొండంత ధైర్యాన్ని చెప్పారు. నేపాల్ చరిత్రలోనే ఘోరమైన ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 900 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 4,000 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
Also Read:IRGC:రెండోరోజు వైమానిక దాడులు
- Advertisement -

