IRGC:రెండోరోజు వైమానిక దాడులు

1
- Advertisement -

అమెరికా వైమానిక దాడులకు సమాధానంగా ఇరాన్ తన సొంత భూభాగం నుండి బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు ప్రారంభించినట్లు ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది.జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు IRGC తెలిపింది. జోర్డాన్ తమ వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా 13 బాలిస్టిక్ క్షిపణుల్లో 10 ఇంటిని గాల్లోనే అడ్డుకోగా, మిగిలిన 3 నిర్మానుష్య ప్రాంతాల్లో పడ్డాయి.

బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరంపై భారీ డ్రోన్ దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. మరోవైపు కువైట్ సైన్యం కూడా తమ వైమానిక సరిహద్దుల్లోకి వచ్చిన డ్రోన్లను అడ్డుకుంటున్నట్లు తెలిపింది.హోర్ముజ్ జలసంధి సమీపంలోని IRGC లక్ష్యాలపై అమెరికా బలగాలు వరుసగా రెండో రోజు వైమానిక దాడులు నిర్వహించాయి.

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ మైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిందని అలాగే జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపైకి ఎనిమిది క్షిపణులను ప్రయోగించిందని (వాటిని అమెరికా విజయవంతంగా కూల్చివేసింది) యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ చర్యలకు సమాధానంగానే తాము ఈ దాడులు ప్రారంభించినట్లు తెలిపింది. ఇరాన్ లోని ఖేష్మ్ (Qeshm) దీవిలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ధృవీకరించింది.

ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ (Truth Social) ఖాతా ద్వారా స్పందిస్తూ ఇరాన్‌కు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.ఇరాన్ గనుక ఈ దాడులకు ప్రతికారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే, వారు మునుపెన్నడూ చూడని రీతిలో భారీ స్థాయి దాడులను ఎదుర్కోవాల్సి వస్తుంది…మరో దాడి జరిగితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఉనికికే ప్రమాదం ఏర్పడేలా మా చివరి దాడులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఈ పరస్పర దాడుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు మండటంతో పాటు ప్రాంతీయంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Also Read:‘మైసా’..రిలీజ్ డేట్ ఖరారు!

- Advertisement -