రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ!

2
- Advertisement -

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికారు. తన 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగమైన సుదీర్ఘ లేఖ ద్వారా అధికారికంగా ప్రకటించారు.ఈ నిర్ణయం నా ఆత్మను కలచివేస్తోంది.. కానీ ఇదే సరైన సమయం…
ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో కష్టతరమైందని మెస్సీ తన సందేశంలో పేర్కొన్నారు.

సుదీర్ఘమైన ఆలోచనల తర్వాత నేను అర్జెంటీనా జాతీయ జట్టు నుండి వైదొలుగుతున్నానని తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం నన్ను ఎంతో బాధించింది, ఇప్పటికీ నా ఆత్మను పిండివేస్తోంది. కానీ వీడ్కోలు చెప్పడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. గత కొన్ని ఏళ్లలో మేము గెలిచిన ట్రోఫీల సమయంలోనే కాకుండా, అంతకంటే ముందు కూడా ఈ జెర్సీ కోసం నా సర్వస్వాన్ని ధారపోశాను. ఫుట్‌బాల్ ద్వారా మిమ్మల్ని సంతోషపరచడానికి, అర్జెంటీనా పౌరులుగా గర్వపడేలా చేయడానికి ఎల్లప్పుడూ శ్రమించాను” అని మెస్సీ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

అలాగే గత 20 ఏళ్లుగా అభిమానులు తనపై చూపించిన అపారమైన ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. “ఇకపై మైదానంలో మీ కేరింతలు వినలేకపోవడం బాధగా ఉన్నా, బయట నుండి మీతో ఒకడిగా జట్టుకు మద్దతు ఇస్తూనే ఉంటాను” అని రాసుకొచ్చారు.

మొత్తం 207 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మెస్సీ.. 125 గోల్స్ కొట్టాడు. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (34) ఆడిన క్రీడాకారుడిగా 21 గోల్స్‌తో మెరిశారు.

Also Read:యశ్‌ను టార్గెట్ చేస్తున్నారు!

2005లో అర్జెంటీనా సీనియర్ జట్టులో అరంగేట్రం చేసిన మెస్సీ, 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలిపి తన కల నెరవేర్చుకున్నారు.

- Advertisement -