యశ్‌ను టార్గెట్ చేస్తున్నారు!

0
- Advertisement -

కన్నడ రాకింగ్ స్టార్, పాన్-ఇండియా హీరో యశ్ తల్లి పుష్ప తన కుమారుడిపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే యశ్ ఎదుగుదలను చూసి తట్టుకోలేక టార్గెట్ చేస్తున్నారని, అతడేమీ ఉగ్రవాది కాదని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒక సాధారణ ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకుగా పుట్టిన యశ్, ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం తన సొంత శ్రమ, కష్టం నమ్ముకుని ఈ స్థాయికి ఎదిగాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రారంభంలో ఎన్నో కష్టాలు అనుభవించాడని, ‘కేజీఎఫ్’ (KGF) సినిమాకు ముందే కన్నడలో ఆయన నటించిన 5 సినిమాలు సూపర్‌హిట్‌లుగా నిలిచాయని తెలిపారు.

ఎంతో క్రమశిక్షణతో, కష్టపడి దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగిన ఒక కళాకారుడిపై అసత్య ప్రచారాలు చేస్తూ మానసికంగా కుంగదీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఒక తల్లిగా తన కొడుకును ఈ రీతిలో టార్గెట్ చేయడం ఎంతో బాధాకరమని, సమాజం నిజానిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:ఆయిల్‌ఫెడ్ భూమిపై రేవంత్ కన్ను..హరీష్‌ ఫైర్

కాగా యశ్ ప్రస్తుతం తన తదుపరి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -