టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు హిమపాతం (ice-rock avalanche) కారణముగా సంభవించిన భయంకరమైన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య దాదాపు 788కి చేరింది. వేలాది మంది గల్లంతవ్వడంతో 20,000 మంది సైనిక సిబ్బంది, 14 మిలిటరీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లను తీవ్రతరం చేశారు.
ఈ తీవ్ర సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం సోమవారం ఉదయం 7:00 గంటల సమయానికి మృతుల సంఖ్య 788కి పెరిగింది. దాదాపు 2,500 నుండి 3,000 మంది వరకు ఇంకా గల్లంతయ్యారని లేదా సమాచారం లేదని, భద్రతా దళాలు 8,700 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించాయని పేర్కొంది. నేపాల్‌లో సంభవించిన ఈ భారీ వరదల వల్ల పలువురు భారతీయ పౌరుల జాడ ఇంకా లభించలేదు. కాగా ఇప్పటివరకు కనీసం 149 నుండి 180 మంది భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకురాగా, సుమారు 275 నుండి 320 మంది ఇంకా గల్లంతై ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ మూలాలున్న 14 మంది యాత్రికులు (7 మంది ఏపీ నివాసితులు, 7 మంది ఎన్‌ఆర్‌ఐలు) కూడా ఉన్నారు.
టిబెట్‌లో విరుచుకుపడిన ఈ ఆకస్మిక వరదల నుండి బయటపడిన 20 మంది తెలుగు యాత్రికుల బృందం టిబెట్ నుండి ఖాట్మండుకు సురక్షితంగా చేరుకుంది. వందలాది మంది గల్లంతైన వారి కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.సురక్షిత తరలింపు ప్రక్రియను వివరిస్తూ ఏపీ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 11:00 గంటల సమయంలో 144 మంది యాత్రికులు టిబెట్‌లోని సాగా కౌంటీ నుండి కోడారి చెక్‌పోస్ట్ ద్వారా ఖాట్మండుకు సురక్షితంగా చేరుకున్నారు. ఈ బృందంలో శాస్త్రి, ఆయన కుటుంబంలోని ముగ్గురు సభ్యులతో సహా 20 మంది తెలుగు యాత్రికులు ఉన్నారు. వీరు ఇక్కడి నుండి ముంబైకి పయనమై, అక్కడి నుండి తమ స్వగ్రామాలకు వెళ్లనున్నారు.
తీవ్రమైన వరదల తర్వాత టిబెట్‌లో ఏర్పడిన ప్రమాదకరమైన తాత్కాలిక సరస్సు వల్ల ప్రమాదాలు పొంచి ఉండటంతో, చిక్కుకున్న పౌరులను రక్షించడానికి నేపాల్ అధికారులతో రాష్ట్ర అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్లలో 20,000 మంది భద్రతా సిబ్బంది, 14 మిలిటరీ హెలికాప్టర్లతో పాటు 6 ప్రత్యేక వైద్య బృందాలు అత్యవసర సహాయాన్ని అందిస్తున్నాయి. త్రిశూలి-3A జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు భారతదేశానికి చెందిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ టీమ్, సాంకేతిక నిపుణులు సహాయం అందిస్తున్నారు.
Also Read:రూ.150 కోట్లు దాటిన ఇరుముడి

