SCO:మోదీ-పుతిన్ భేటీ

1
- Advertisement -

ఆదివారం కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..ఇవాళ  జరిగే 26వ SCO సదస్సు విరామ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది.ప్రధాని మోదీ, పుతిన్ల మధ్య సమావేశం ఖాయమైనప్పటికీ, షీ జిన్‌పింగ్‌తో చర్చలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే వీరిద్దరూ సమావేశమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని, అదే గనుక జరిగితే ఏడాది కాలంలో వీరిద్దరి మధ్య ఇది రెండో సమావేశం అవుతుందని భావిస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికాతో సంబంధాలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి, రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి పుతిన్‌తో ప్రధాని మోదీ జరిపే భేటీ అత్యంత కీలకమైనదిగా మారనుంది.

ఒకవేళ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయితే, వాస్తవ అధీన రేఖ (LAC) వద్ద సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుంటూ భారత్-చైనాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈ సమావేశం దారితీస్తుంది. అలాగే ఈ చర్చల్లో ఇరాన్, ఉక్రెయిన్‌లలో జరుగుతున్న ప్రస్తుత యుద్ధ వాతావరణంపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ రష్యాలోను, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ చైనాలోనూ పర్యటించి, ఆయా దేశాలతో న్యూఢిల్లీ సంబంధాలను మెరుగుపరిచే మార్గాలపై చర్చించిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

Also Read:రూ.150 కోట్లు దాటిన ఇరుముడి

ఉజ్బెకిస్తాన్‌లో రెండు రోజుల పర్యటనను ముగించుకుని ప్రధాని మోదీ ఆదివారం కిర్గిజిస్తాన్ చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఇరు దేశాలు తమ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాలని, 2030 నాటికి వార్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

- Advertisement -