న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ఒక సభను ఉద్దేశించి ఆర్‌ఎస్‌ఎస్ (RSS) అధినేత మోహన్ భగవత్ మాట్లాడుతూ.. స్వామి వివేకానందను స్మరించుకుంటూ, భారత్ DNA లో ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంతర్లీనంగా ఉందన్నారు. అలాగే భారతీయ డయాస్పోరా (విదేశాల్లో ఉన్న భారతీయులు) తమ ‘కర్మభూమి’ పట్ల నమ్మకంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) మాట్లాడుతూ, ‘భారతీయ డయాస్పోరా’ వారు నివసిస్తున్న దేశమైన తమ ‘కర్మభూమి’ పట్ల విశ్వసనీయంగా ఉండాలని, అయితే తమ ‘జన్మభూమి’ అందించిన విలువలను తప్పక కలిగి ఉండాలని అన్నారు.
న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్’లో భగవత్ మాట్లాడుతూ.. భారతీయ డయాస్పోరా తమ ‘జన్మభూమి’కి ఏమైనా సహకారం అందించాలనే కోరికను పెంచుకునే ముందు, తమ ‘కర్మభూమి’ పట్ల బాధ్యతలను నెరవేర్చాలని చెప్పారు.మన బాధ్యత ఏమిటి? మనం అమెరికాలో ఉన్నాం, అమెరికాలో నివసిస్తున్నాం, అమెరికాలోనే సంపాదిస్తున్నాం. కాబట్టి మనం అమెరికన్లం. మనం అమెరికా పట్ల నిజాయితీగా ప్రవర్తించాలి… విదేశాల్లో ఉన్న భారతీయ డయాస్పోరాకి తమ కర్మభూమి పట్ల ఒక బాధ్యత ఉంది…. దాన్ని వారు నెరవేర్చాలి. తమ కర్మభూమికి నమ్మకంగా ఉండాలి అన్నారు.
తన ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత భారత్ DNA లో ‘భిన్నత్వంలో ఏకత్వం’ నిండి ఉందని పునరుద్ఘాటించారు. వైవిధ్యం ఉన్నప్పటికీ ఏకత్వంగా కలిసి జీవించవచ్చని భారత్ ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. స్వామి వివేకానందను గుర్తుచేసుకుంటూ, దేశాలు అంటే కేవలం భౌగోళిక ప్రాంతాలు మాత్రమే కాదని, వాటికి సాధించాల్సిన ఒక పెద్ద లక్ష్యం నెరవేర్చాల్సిన ఒక విధి ఉంటాయని తెలిపారు.
Also Read:ఉజ్బెకిస్తాన్‌లో ప్రధాని మోది
భారత్‌లోని నాగ్‌పూర్ నుండి నేటి ఆనందాన్ని, నేటి స్ఫూర్తిని మీతో పంచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అన్నప్పుడు తరచుగా ఒక పదం చర్చకు వస్తుంది, అదే ‘బహుళత్వం’ అలాగే భారత్ అన్నప్పుడు మరొక పదం చర్చకు వస్తుంది: అదే ‘భిన్నత్వంలో ఏకత్వం’. భారత్‌కు ఈ ఏకత్వం, ఈ వైవిధ్యం రెండూ DNA లోనే ఉన్నాయి అని భగవత్ అన్నారు.

