ప్రేమమ్ సినిమాతో వెండితెర మీదకు దూసుకొచ్చిన బ్యూటీ సాయి పల్లవి. ముఖం మీద మొటిమలు.. చెదరని చిరునవ్వు.. పక్కింటి అమ్మాయిలా చూడగానే ఆకట్టుకొనే రూపం లాంటి అంశాలు సాయి పల్లవికి కలిసి వచ్చాయి. ఫిదా రాకముందే ప్రేమమ్ చిత్రంతోనే పాయి పల్లవి ఆకట్టుకొన్నది. తెలుగులో చాలా అవకాశాలే వచ్చినా ఎదురుపడి ఒప్పేసుకోకుండా తగిన పాత్ర కోసం వేచి చూసింది. దాని ఫలితమే ఫిదాలో ఆమె భాగమతి పాత్ర.
తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి మధ్య సాగిన అందమైన ప్రేమకథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో భానుమతిగా సాయిపల్లవి నటనతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న ఏకంగా 5 సినిమాలు రిలీజైనప్పటికి ఫిదా చిత్రం తన సత్తా చూపిస్తూ దూసుకెళుతుంది.
వరుణ్ తేజ్ పర్ ఫార్మెన్స్, సాయి పల్లవి గ్లామర్ , శేఖర్ కమ్ముల స్టైలిష్ టేకింగ్, శక్తికాంత్ సంగీతం సినిమాని ఓ రేంజ్ లో నిలిపింది. ముఖ్యంగా సాయిపల్లవి తెలంగాణ అమ్మాయి పాత్రలో జీవించింది. తన అద్బుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమాతో తనని ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలియజేసింది. భాగమతి గా యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని ట్వీట్ చేసింది ఈ మలయాళీ బ్యూటీ.
Mee adhari premaki Runapadi poyanu❤️ Nannu Bhanumathi ga accept chesinadhuku chaala chaala thanks ❤️ I feel so blessed 🙏🏻
— Sai Pallavi (@Sai_Pallavi92) July 22, 2017