బెంగళూరులోని ప్రముఖ ‘నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ’ (NLSIU) ఈ ఏడాది సెప్టెంబర్ 12న నిర్వహించాల్సిన 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ 34వ వార్షిక కాన్వొకేషన్ (పట్టభద్రుల ఉత్సవం)ను రద్దు చేసింది. “తప్పనిసరి పరిస్థితుల” వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ యాజమాన్యం గురువారం (ఆగస్ట్ 27) అధికారిక ప్రకటన విడుదల చేసింది.
విద్యార్థులకు భౌతికంగా కాన్వొకేషన్ నిర్వహించకుండా ‘ఇన్ ఆబ్సెంటియా’ (In absentia) పద్ధతిలో పట్టాలను అందజేయనున్నట్లు తెలిపింది. కాన్వొకేషన్‌కు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రాలను ఆహ్వానించడాన్ని వర్సిటీకి చెందిన 700 మందికి పైగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు.
హైదరాబాద్‌లోని నల్సార్ లా వర్సిటీ విద్యార్థులపై గతంలో బిసిఐ అనుచిత చర్యలకు పాల్పడిందని, సీజేఐ పర్యటనను వ్యతిరేకించినందుకు వారి నమోదు (ఎన్‌రోల్‌మెంట్)ను తాత్కాలికంగా నిలిపివేయడం భావప్రకటన స్వేచ్ఛపై దాడి అని NLSIU విద్యార్థులు ఆరోపించారు. కాన్వొకేషన్ రద్దు కావడంతో గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు తమ డిగ్రీ సర్టిఫికేట్లను కొరియర్ ద్వారా పొందవచ్చని లేదా క్యాంపస్‌కు వచ్చి స్వయంగా తీసుకెళ్లవచ్చని వర్సిటీ వెల్లడించింది.
Also Read:MEA:నేపాల్‌లో గల్లంతైన భారతీయుల లిస్ట్

