రేవంత్‌కు ఎథిక్స్‌ ఉన్నాయా?

1
- Advertisement -

నిండు శాసనసభలో సభ్యులపై రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాడిన అసభ్య పదజాలం ఎథిక్స్ కమిటీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ముందు రేవంత్‌ రెడ్డినే ఎథిక్స్‌ కమిటీ ముందుకు పిలవాలి అని డిమాండ్ చేశారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి.. నైతిక విలువలు అనేవి అందరికీ సమానంగా వర్తించాలి. ..కౌశిక్‌ రెడ్డికి ఒక నిబంధన, రేవంత్‌ రెడ్డికి మరో నిబంధన ఉండకూడదు అన్నారు.కౌశిక్‌ రెడ్డికి వర్తించే నిబంధనలే కాంగ్రెస్‌ నాయకులకు కూడా వర్తించాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, ఈ మూడేళ్లలో ప్రజా సమస్యల మీద ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతులు నొక్కేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రులకు ‘ఎథిక్స్’ అనే పదం ఉచ్ఛరించే అర్హత కూడా లేదు.దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది.ఎథిక్స్ కమిటీ లేని రోజే కౌశిక్ రెడ్డిని ఆ కమిటీకి రిఫర్ చేయడం చూస్తే.. ముందే నిర్ణయించుకుని కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు స్పష్టమవుతోంది..ఎథిక్స్ కమిటీ అనేది సభ్యుల నైతిక విలువలను కాపాడేందుకు ఉండాలి..
అంతేకానీ కాంగ్రెస్ రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు కాదు అన్నారు.

Also Read:చిదంబరంకు శివరాజ్‌ కౌంటర్

- Advertisement -