ఇరుముడి..విజయ విహారం

1
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ అన్‌స్టాపబుల్ కలెక్షన్లతో ఘన విజయాన్ని సాధిస్తూ దూసుకుపోతోంది.

నార్త్ అమెరికా మార్కెట్‌లో ‘ఇరుముడి’ సరికొత్త రికార్డును నెలకొల్పింది. అక్కడ విజయవంతంగా 1,00,000 (లక్ష) పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త మైలురాయిని చేరుకుంది. రవితేజ కెరీర్‌లోనే ఓవర్సీస్ మార్కెట్‌లో అత్యంత వేగంగా ఈ స్థాయి ఆదరణ సాధించిన చిత్రాల్లో ఒకటిగా ‘ఇరుముడి’ నిలిచింది.

Also Read:చిదంబరంకు శివరాజ్‌ కౌంటర్

తండ్రీకూతుళ్ల అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యం మరియు బాధ్యతాయుతమైన సామాజిక కథాంశం కలగలిసి ఉండటంతో ఎన్నారై (NRI) ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. మాస్ ఇమేజ్ ఉన్న రవితేజ సరికొత్త వైవిధ్యమైన పాత్రలో కనిపించడం, దానికి తోడు థియేటర్లలో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో ‘ఇరుముడి’ హవా స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -