మేం గెలిస్తే E20 బ్యాన్ చేస్తాం:కేజ్రీవాల్

1
- Advertisement -

2027 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. గోవాలో ఆప్ ప్రభుత్వం ఏర్పడితే 2027 మార్చి 10 తర్వాత కేవలం 5 రోజుల్లోనే ఇథనాల్ బ్లెండెడ్ (E20) పెట్రోల్ అమ్మకాలను నిషేధిస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ఆ పని చేయకపోతే తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు.

E20 పెట్రోల్ (20% ఇథనాల్, 80% పెట్రోల్) వాడటం వల్ల వాహనాల ఫ్యూయల్ సిస్టమ్స్, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని మరియు మైలేజీ గణనీయంగా పడిపోతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజల నుంచి ఈ విషయమై వేలాది ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. చక్కెర ధరల పెరుగుదల: ఇథనాల్ తయారీ కోసం పెద్ద మొత్తంలో చెరకును కేటాయించడం వల్లే దేశంలో చక్కెర కొరత ఏర్పడి, దాని ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు.

Also Read:తృణమూల్ రెబెల్ ఎంపీలకు నోటీసులు

2027 మార్చి 10న ఎన్నికల ఫలితాలు వచ్చాక, మార్చి 15 నాటికి E20ని గోవాలో బ్యాన్ చేస్తాం. అలా చేయలేకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా” అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన E20 పెట్రోల్ విధానంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఆప్ ఈ అంశాన్ని ఎన్నికల ప్రధాన అజెండాగా మారుస్తోంది.

- Advertisement -