తనపై అకారణంగా దాడి చేసి పరువుకు భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి అని వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జానపద కళాకారిణి మాధురి రాథోడ్.
ఈ నెల 19న రెడ్డి భవన్‌లో ఈశ్వర్ సాయి సతీమణి శరణ్య తనను అసభ్య పదజాలంతో దూషించి..దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దాడి దృశ్యాలను రికార్డు చేయడంతో పాటు, తన వద్ద ఉన్న 50 వేల విలువైన ఐఫోన్‌ను లాక్కున్నారని ఆరోపించారు.
సదరు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసి..తన గౌరవానికి భంగం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈశ్వర్ సాయి సతీమణి శరణ్యతో పాటు కొన్ని మీడియా సంస్థలపై కేసు నమోదు చేయగా వీరిపై దర్యాప్తు జరుపుతున్నట్లు వేములవాడ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
Also Read:హార్ముజ్..అమెరికా భూభాగమే!

