సీఎం విజయ్ మరో బంపర్ ఆఫర్

3
- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన నవజాత శిశువుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఒక నూతన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, అర్హులైన ప్రతి శిశువుకు ఉచితంగా బంగారు ఉంగరాన్ని అందించేందుకు నిర్ణయించింది.

ఈ పథకానికి “తాయిమామన్ తంగ మోతిర తిట్టం”గా నామకరణం చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే అర్హులైన నవజాత శిశువులందరికీ ఒక్కో గ్రాము బరువుగల బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందజేస్తారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ దిగ్గజం సి.ఎన్. అన్నాదురై జయంతి సందర్భంగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.ఈ పథకం అమలుకు సంబంధించి నిర్వహించిన టెండర్ ప్రక్రియలో ప్రముఖ స్వర్ణాభరణాల సంస్థ జోస్ అలుక్కాస్ (Jos Alukkas) కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. బంగారం ధర మినహా, ఉంగరాల తయారీ, రవాణా, ఇన్సూరెన్స్ వంటి ఇతర ఖర్చులన్నింటికీ కేవలం ఒక పైసా మాత్రమే కోట్ చేసి ఈ టెండర్‌ను సాధించడం విశేషం. ఈ పథకం ద్వారా తమిళనాడులోని వేలాది పేద కుటుంబాలకు చెందిన నవజాత శిశువులకు లబ్ధి చేకూరనుంది.

Also Read:పెరుగు జిగురుగా ఎందుకు మారుతుంది?

- Advertisement -