టెస్ట్ క్రికెట్..అత్యధిక సిక్సర్లు కొట్టింది వీరే!

3
- Advertisement -

శ్రీలంకతో గాలెలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ 100 టెస్టు సిక్సర్లను పూర్తి చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-5 బ్యాటర్ల వివరాలు ఇవే:

ఇంగ్లాండ్ దిగ్గజం బెన్ స్టోక్స్ 122 టెస్టు మ్యాచ్‌ల్లో 138 సిక్సర్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. 14 సెంచరీలతో సహా 7,273 పరుగులు చేశారు. న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ బ్రెండన్ మెక్‌కలమ్ 101 టెస్టుల్లో 107 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తన టెస్టు కెరీర్‌లో 12 సెంచరీలతో మొత్తం 6,453 పరుగులు చేశారు.

గాలె టెస్టులో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయుడిగా పంత్ నిలిచారు. ఆయన కేవలం 51 టెస్టుల్లోనే 8 సెంచరీలతో 3,662 పరుగులు చేసి, 100 సిక్సర్లు బాదారు. వరల్డ్ క్రికెట్‌లో వికెట్ కీపర్-బ్యాటర్ పాత్రను విప్లవాత్మకంగా మార్చిన ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ 96 టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టారు. ఆయన 17 సెంచరీలతో 5,570 పరుగులు చేశారు.

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ 107 టెస్టుల్లో 98 సిక్సర్లతో ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్‌గా రాణించిన ఆయన 156 ఇన్నింగ్స్‌లలో 7 అర్ధసెంచరీలతో 2,245 పరుగులు చేశారు.

ALso Read:ఇరాన్‌కు సాయం చేస్తే..ట్రంప్ వార్నింగ్!

- Advertisement -