రేవంత్‌పై కొండా కామెంట్స్‌..కౌంటర్

3
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ నేత కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల వల్ల పక్క పార్టీల నాయకులు కాంగ్రెస్‌ను ట్రోల్ చేసే అవకాశం లభించిందని ఇందిరా శోభన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము గత 10, 15 ఏళ్ల నుంచి పార్టీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. మాకే ఇంకా ఎమ్మెల్యే టికెట్ రాలేదు అని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడంపై మండిపడుతూ రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని నీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టు, దమ్ముంటే నిరూపించు అని సవాలు విసిరారు. సుష్మిత చేస్తున్న ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యల వల్ల ఆమె తల్లి (కొండా సురేఖ) సమాజంలో తలదించుకోవాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కుట్ర పన్ని, సుష్మితతో వెనుక ఉండి మాట్లాడిస్తున్నారని ఇందిరా శోభన్ ఆరోపించారు.

మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టతనిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిని రేవంత్ రెడ్డి ప్రకటించినా అది చెల్లదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను నిర్ణయించే అధికారం కేవలం హైకమాండ్ (పార్టీ అధిష్టానానికి) మాత్రమే ఉంటుందని ఏ ఒక్కరి ప్రకటనలూ అంతిమం కాదని ఆయన తేల్చి చెప్పారు.

Also Read:ఇరాన్‌కు సాయం చేస్తే..ట్రంప్ వార్నింగ్!

- Advertisement -